Gutta Jwala: భర్తకు తొలి వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్ చెప్పిన గుత్తా జ్వాల
![gutta jwala first wedding anniversary greetings to his second husband](https://imgd.ap7am.com/thumbnail/cr-20220423tn6263be10a2888.jpg)
- ఏడాది క్రితం విష్ణు విశాఖతో గుత్తా రెండో వివాహం
- శుక్రవారం రాత్రి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలు
- సోషల్ మీడియాలో ఫొటోను పోస్ట్ చేసిన గుత్తా జ్వాల
మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల తన రెండో భర్తకు తొలి వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్ చెప్పారు. శుక్రవారం రాత్రి భర్త విష్ణు విశాల్‌తో కలిసి తొలి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న గుత్తా జ్వాల... ఆ వేడుకల ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తనను తాను ఆకాశానికెత్తేసుకున్న గుత్తా జ్వాల సదరు ఫొటోకు ఆసక్తికర కామెంట్‌ను జోడించారు.
భర్త గారికి తొలి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్రేమతో పేర్కొన్న జ్వాల... బాధ్యత కలిగిన, బాగా చూసుకునే భార్య దొరికిన భర్తగా తమరు భావిస్తున్నారని చెప్పగలను అంటూ తమ వివాహ బంధంపై ఆసక్తికర కామెంట్ చేశారు. గుత్తా చెప్పిన మాట నిజమేనన్నట్లుగా గుత్తాను పెళ్లి చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ పేరిట విష్ణు విశాల్ తీసిన సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.