Cricket: ధోనీ ఫినిషింగ్ తర్వాత జడేజా చేసిన పని వైరల్.. మీరూ చూసేయండి!

Jadeja Bow Down Before Dhoni after finishing

  • ముంబై నుంచి గెలుపును లాగేసుకున్న ధోనీ
  • చివరి బంతికి ఫోర్ బాదిన మాజీ సారథి
  • ధోనీ ముందు జడేజా బో డౌన్

నోటికాడికొచ్చిన కూడు.. దొరక్కుండా పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే చేతిలో ఉందనుకున్న మ్యాచ్ చివరి బంతికి చేజారిపోతే ఆ జట్టు పరిస్థితి ఏంటి? అచ్చంగా నిన్న ముంబై ఇండియన్స్ పరిస్థితి అదే. అత్యుత్తమ ఫినిషర్ అనే బిరుదున్న మహేంద్ర సింగ్ ధోనీ.. గెలుపు అనే కూడును ముంబై నుంచి లాగేసుకున్నాడు. 

చివరి ఓవర్ లో రెచ్చిపోయి చెన్నైని గెలిపించాడు. తనలోని ఆట పదును ఏమాత్రం తగ్గలేదని ప్రత్యర్థులు, ఆటగాళ్లకు చాటిచెప్పాడు. ప్రతి ఒక్కరూ ధోనీ ఫినిషింగ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా కూడా ధోనీని ప్రశంసించాడు. 

అవును, చివరి బంతికి తనదైన శైలిలో ధోనీ మ్యాచ్ ను ఫినిష్ చేసే సరికి జడ్డూ.. స్టన్ అయిపోయాడు. విన్నింగ్ షాట్ తర్వాత మైదానం వీడి వస్తున్న ధోనీకి జడేజా సర్ ప్రైజ్ ఇచ్చాడు. ధోనీ ఎదురుగా వెళ్లి క్యాప్ తీసి వంగి నమస్కరించాడు. అనంతరం షేక్ హ్యాండిచ్చి అభినందించాడు. తద్వారా మాజీ సారథి గొప్ప ఫినిషర్ అనే సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియె నెట్టింట్లో వైరల్ అయిపోతోంది.  

కాగా, ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో 18 పరుగులు అవసరమైన దశలో ధోనీ తన విశ్వరూపాన్ని చూపాడు. చివరి నాలుగు బంతులను 6, 4, 2, 4గా మలిచి చెన్నైకి విజయాన్నందించాడు. ధోనీ 13 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు.

Cricket
IPL
MS Dhoni
Ravindra Jadeja
Chennai Super Kings
Mumbai Indians

More Telugu News