Chandrababu: చంద్రబాబుతో కలిసి ఉన్న రేర్ ఫొటోను షేర్ చేసిన చిరంజీవి!

Chiranjeevi shares rare pic of him with Chandrababu

  • ఈరోజు 73వ పడిలో అడుగుపెట్టిన చంద్రబాబు
  • చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
  • కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన మెగాస్టార్

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఈరోజు ఆయన 73వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. 

'శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. దీంతోపాటు గతంతో చంద్రబాబుతో కలిసి దిగిన పాత ఫొటోను షేర్ చేశారు.

  • Loading...

More Telugu News