YSRCP: వైసీపీలో రీజ‌నల్ కో ఆర్డినేట‌ర్ల నియామ‌కం.. 11 మందికి కొత్త బాధ్య‌త‌లు

11 ysrcp leaders apponted as party regional co ordinators

  • అనుబంధ విభాగాల ఇంచార్జీగా విజయసాయిరెడ్డి
  • ముగ్గురు మంత్రులు, ముగ్గురు తాజా మాజీ మంత్రుల‌కు చోటు
  • స‌జ్జ‌ల‌, వైవీల‌కు కూడా రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లుగా బాధ్య‌త‌లు

ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీలో రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ల పేరిట 11 మంది నేత‌ల‌కు కొత్త బాధ్య‌త‌లు ప్ర‌క‌టించారు. మొత్తం 11 మంది నేత‌ల‌ను రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లుగా నియ‌మించిన పార్టీ అధిష్ఠానం ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డిని అన్ని అనుబంధ విభాగాల ఇంచార్జీగా నియ‌మించిన పార్టీ అధిష్ఠానం.. ఆయ‌న‌కు రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్‌గా మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు. 

రాష్ట్రాన్ని 9 రీజియన్లుగా విభజించిన వైసీపీ... వాటికి 11 మంది రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఇక రీజ‌నల్ కో ఆర్డినేట‌ర్లుగా ప‌ద‌వులు ద‌క్కిన వారిలో ముగ్గురు మంత్రులు ఉండ‌గా, ఇటీవ‌లే మంత్రి ప‌ద‌వులు కోల్పోయిన తాజా మాజీ మంత్రులు ముగ్గురికి చోటు ద‌క్కింది. 11 మంది రీజ‌న‌ల్ కో ఆర్డినేటర్లు వారికి ద‌క్కిన జిల్లాల బాధ్య‌త‌లు కింది విధంగా ఉన్నాయి. 

విశాఖ‌, అన‌కాప‌ల్లి, అల్లూరి జిల్లాలు... వైవీ సుబ్బారెడ్డి
చిత్తూరు, అనంత‌పురం, స‌త్య‌సాయి, అన్న‌మ‌య్య జిల్లాలు... పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
క‌ర్నూలు, నంద్యాల జిల్లాలు... స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి
క‌డ‌ప‌, తిరుప‌తి జిల్లాలు... అనిల్ కుమార్ యాద‌వ్‌
నెల్లూరు, ప్ర‌కాశం, బాప‌ట్ల జిల్లాలు... బాలినేని శ్రీనివాస‌రెడ్డి
ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు... మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌
గుంటూరు, ప‌ల్నాడు జిల్లాలు... కొడాలి నాని
ఉభ‌య గోదావ‌రి, కాకినాడ, ఏలూరు, కోన‌సీమ‌ జిల్లాలు... పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌
పార్వ‌తీపురం, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలు... బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

  • Loading...

More Telugu News