Telangana: తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!

Raom forecast to Telangana

  • పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
  • గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
  • ఈరోజు హైదరాబాద్ లో హడలెత్తించిన ఎండలు

ముండుటెండలతో అల్లాడుతున్న తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురును అందించింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. మరోవైపు ఈరోజు హైదారాబాద్ లో ఎండలు హడలెత్తించాయి. ఎల్బీనగర్ లో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Telangana
Rain
Forecast
  • Loading...

More Telugu News