CPI Ramakrishna: పోలవరం ఎత్తును త‌గ్గించేందుకు ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర స‌ర్కారు కుట్ర: జ‌గ‌న్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

cpi ramakrishna slams jagan

  • పోలవరం ఏపీకి జీవనాడి వంటిదన్న సీపీఐ నేత  
  • కేంద్ర స‌ర్కారు తీరుకి త‌లొగ్గకూడ‌దని సలహా  
  • ఏపీకి తీరని ద్రోహం చేసినవారవుతారని వ్యాఖ్య 

పోల‌వ‌రం గురించి ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓ లేఖ రాసి ప‌లు అంశాలు వివ‌రించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర స‌ర్కారు క‌లిసి పోలవరం ఎత్తును 135 అడుగులకు తగ్గించే కుట్రలకు పాల్పడుతున్నాయ‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. 

పోలవరం ఏపీకి జీవనాడి వంటిదని, ఆ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర స‌ర్కారు తీరుకి త‌లొగ్గకూడ‌ద‌ని రామ‌కృష్ణ సూచించారు. ఒక‌వేళ త‌లొగ్గితే ఏపీకి తీరని ద్రోహం చేసినవారవుతారని ఆయన పేర్కొన్నారు. పోల‌వ‌రంపై రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి తాజాగా చేసిన‌ వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. పోల‌వ‌రం విష‌యంపై వెంట‌నే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న అన్నారు.

CPI Ramakrishna
Jagan
YSRCP
  • Loading...

More Telugu News