Telangana: తెలంగాణ కరోనా రోజువారీ కేసుల వివరాలు
![Telangana daily corona cases details](https://imgd.ap7am.com/thumbnail/cr-20220416tn625af07810f32.jpg)
- గత 24 గంటల్లో 14,127 కరోనా పరీక్షలు
- 24 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 15 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 22 మంది
- ఇంకా 222 మందికి చికిత్స
తెలంగాణలో తాజాగా 14,127 కరోనా పరీక్షలు నిర్వహించగా, 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 15 కొత్త కేసులు వెల్లడి కాగా, సంగారెడ్డి జిల్లాలో 2, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2, మంచిర్యాల జిల్లాలో 2, కరీంనగర్ జిల్లాలో 2, వరంగల్ రూరల్ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 22 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,619 మంది కరోనా బారినపడగా, వారిలో 7,87,286 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 222 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220416fr625af030f115d.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220416fr625af040cd3cd.jpg)