KTR: కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ‌.. తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష‌కిదే నిద‌ర్శ‌న‌మ‌ని నిర‌స‌న‌

ktr letter to union it minister Ashwini Vaishnaw

  • 12  రాష్ట్రాల‌కు 22 ఎస్టీపీఐల‌ను ప్ర‌క‌టించిన కేంద్రం
  • తెలంగాణ‌కు కేటాయింపులేమీ లేని వైనం
  • ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ‌

తెలంగాణ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వ వివ‌క్ష‌కు మ‌రో నిద‌ర్శ‌నం ఇదేనంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు శ‌నివారం ఓ లేఖ రాశారు. ఈ లేఖ‌లో సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)ల కేటాయింపుల‌ను ప్ర‌స్తావించిన కేటీఆర్‌.. అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్న తెలంగాణ‌కు ఒక్క‌టంటే ఒక్క ఎస్టీపీఐని కేటాయించ‌క‌పోవ‌డం రాష్ట్రం ప‌ట్ల కేంద్రం వివ‌క్షేన‌ని ఆయ‌న గుర్తు చేశారు.

తాజాగా దేశంలోని 12 రాష్ట్రాల‌కు 22 ఎస్టీపీఐల‌ను కేటాయించిన కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు ఒక్క ఎస్టీపీఐని కూడా కేటాయించ‌లేదు. దీంతో ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన కేటీఆర్‌... కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రాష్ట్రానికి ఎస్టీపీఐ ఇవ్వ‌కుండా కేంద్రం చూపిన వైఖ‌రితో తెలంగాణ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ఎలా వ‌స్తాయ‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఐటీ రంగంలో అద్భుత‌మైన ప్ర‌గ‌తిని న‌మోదు చేస్తున్న తెలంగాణ‌కు ఎస్టీపీఐ ఇవ్వ‌క‌పోవ‌డం కేంద్ర ప్ర‌భుత్వ వివ‌క్షాపూరిత వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మేన‌ని ఆ లేఖ‌లో కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News