Chinthamaneni Prabhakar: చింత‌మ‌నేని వినూత్న నిరసన... ప్ర‌యాణికులకు రూ.20, మ‌జ్జిగ ప్యాకెట్ పంపిణీ

chintamaneni prabhakar strange protest at eluru

  • ఆర్టీసీ చార్జీల పెంపుపై నిర‌స‌న‌ల‌కు టీడీపీ పిలుపు
  • ఏలూరు మినీ బైపాస్ వ‌ద్ద చింత‌మ‌నేని నిర‌స‌న‌
  • ప్రయాణికుల‌కు న‌గ‌దు, మ‌జ్జిగ పంపిణీ చేస్తూ వినూత్న నిర‌స‌న‌

టీడీపీ సీనియ‌ర్ నేత‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ శ‌నివారం ఏలూరు జాతీయ ర‌హ‌దారిపై నిర‌స‌న‌కు దిగారు. ఏపీలో పెంచిన ఆర్టీసీ చార్జీల‌ను త‌గ్గించాల‌ని టీడీపీ నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా శ‌నివారం ఏలూరు మినీ బైపాస్ వ‌ద్ద‌ నిర‌స‌న‌కు దిగిన చింత‌మ‌నేని... ఆర్టీసీ చార్జీల‌ను త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా చింత‌మ‌నేని వినూత్న నిర‌సన‌‌కు దిగారు. బ‌స్సుల్లో వెళుతున్న ప్ర‌యాణికుల‌కు ఒక్కొక్క‌రికి రూ.20 నోటుతో పాటు ఓ చ‌ల్ల‌టి మ‌జ్జిగ ప్యాకెట్ అందించారు. పెంచిన చార్జీల‌ను ప్ర‌యాణికులు భ‌రించ‌లేకున్నార‌ని చెప్పేందుకు రూ.20 ఇచ్చిన చింత‌మ‌నేని... వేడిమి నుంచి ఉప‌శ‌మ‌నానికి మ‌జ్జిగ ప్యాకెట్ అందించారు.

Chinthamaneni Prabhakar
TDP
Eluru
  • Loading...

More Telugu News