SRH: కోల్ కతా జట్టుతో పోరు... సన్ రైజర్స్ విజయలక్ష్యం 176 పరుగులు
- ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచిన సన్ రైజర్స్
- మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా
- రాణించిన నితీశ్ రాణా, రసెల్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 రన్స్ చేసిన కోల్ కతా
ప్రత్యర్థులను ఓ మోస్తరు స్కోరుకు పరిమితం చేసి, ఆపై లక్ష్యఛేదన చేయడం ఇప్పటివరకు సన్ రైజర్స్ అనుసరిస్తున్న వ్యూహం. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కాస్త ఎక్కువే స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. మరి ఈ స్కోరును సన్ రైజర్స్ అధిగమిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి కోల్ కతా జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. నితీశ్ రాణా 54, ఆండ్రీ రసెల్ 49 (నాటౌట్), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, భువనేశ్వర్ కుమార్ 1, మార్కో జాన్సెన్ 1, జగదీశ సుచిత్ 1 వికెట్ తీశారు.