Rain: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Rain alert for AP and Telangana

  • ఏపీలో నేడు, రేపు వర్షాలు
  • తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
  • ఏపీలో తేలికపాటి వానలు
  • తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ఏపీలో రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల స్వల్పస్థాయిలో వర్షం కురుస్తుందని, రాయలసీమలో ఇవాళ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని వివరించింది.

అటు, తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు, గరిష్ఠంగా 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

Rain
Andhra Pradesh
Telangana
Weather
  • Loading...

More Telugu News