Telangana: గుక్కెడు తాగునీళ్ల కోసం ఎన్ని తిప్పలో.. చిన్న గుంట దగ్గర ఎండలో గంటల కొద్దీ ఎదురుచూపులు.. ఇదిగో వీడియో

Adilabad Public Water Vows

  • ఆదిలాబాద్ జిల్లాలో దారుణ పరిస్థితి
  • కిలోమీటర్ల దూరం నడుస్తున్న వైనం
  • తమ కష్టాన్ని తీర్చాలని ప్రజల వేడుకోలు

గుక్కెడు తాగు నీటి కోసం ఆదివాసీలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇంటికి నీళ్లు రాక.. కనుచూపు మేరలో నీళ్లు కానరాక కిలోమీటర్ల దూరం నడిచిపోయి బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. 

అసలే మండు వేసవి కావడంతో బావులు కూడా ఎండిపోయాయి. దీంతో చిన్న చిన్న గుంటలు, చెలిమల్లో నీళ్లుంటే చెంబులతో తోడి పోసుకుంటున్నారు. చిన్న గుంటలో నీళ్ల కోసం పదుల సంఖ్యలో జనాలు అక్కడ గుమిగూడుతుండడంతో తమ వంతు వచ్చే దాకా వేచి చూస్తున్నారు. ఒక్క బిందె నీళ్ల కోసం గంటల కొద్దీ ఎండలోనే మగ్గుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలం దుబ్బగూడలో అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. అక్కడ ప్రజల గొంతు తడారని పరిస్థితి ఏర్పడింది.  

Telangana
Adilabad District
Drinking Water

More Telugu News