Atchannaidu: గ‌తంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల వీడియోను పోస్ట్ చేసి, విమ‌ర్శ‌లు గుప్పించిన అచ్చెన్నాయుడు

Atchannaidu slams jagan

  • ఇంకోసారి టీడీపీకి ఓటు వేస్తే వీర బాదుడేనని అప్పట్లో జ‌గ‌న్ వ్యాఖ్య 
  • ఆ వ్యాఖ్య‌లు జ‌గ‌న్‌కే వ‌ర్తిస్తాయన్న అచ్చెన్నాయుడు
  • అసలు సిసలు బాదుడు అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నార‌ని విమ‌ర్శ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పెరిగిన బ‌స్సు ఛార్జీల‌పై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల వీడియోను ఆయ‌న ఈ సంద‌ర్భంగా పోస్ట్ చేశారు. 'ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు.. ఇంకోసారి టీడీపీకి ఓటు వేస్తే బాదుడే బాదుడు కాదు.. వీర బాదుడు ఉంటుంది' అని అందులో జ‌గ‌న్ అన్నారు. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌కే వ‌ర్తిస్తాయంటూ అచ్చెన్నాయుడు చుర‌క‌లంటించారు. 

'నాడు వైఎస్ జ‌గ‌న్ నిజ స్వరూపం తెలియక ఓట్లు వేసిన ప్రజలకు, అసలు సిసలు బాదుడు అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నాడు. ఈ సారి జగన్ రెడ్డి మాట నమ్మి ఎవరైనా ఓట్లు వేస్తే, బాదుడే బాదుడు కాదు వీరబాదుడు ఉంటుందని ఇప్పటికే 2 సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచిన జగన్ చెబుతున్నాడు' అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News