Bandi Sanjay: అక్బరుద్దీన్ కేసు కొట్టివేతపై బండి సంజయ్ స్పందన ఇదే
- కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదు
- ప్రభుత్వం కావాలనే ఆధారాలు సమర్పించలేదు
- ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అప్పీల్‌కు వెళ్లాలి
- కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎంవి కుమ్మక్కు రాజకీయాలన్న బండి
మజ్లిస్ కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ విద్వేషపూరిత వ్యాఖ్యల కేసును కొట్టివేస్తూ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేస్తూనే.. మరోమారు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయరాదని, కోర్టు తీర్పును విజయంగా పరిగణించరాదని, సంబరాలు చేసుకోరాదని న్యాయమూర్తి తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
కాగా, తాజాగా ఈ తీర్పుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. "అక్బరుద్దీన్ కేసులో కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదు. ప్రభుత్వం కావాలనే ఆధారాలు సమర్పించలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అప్పీల్‌కు వెళ్లాలి. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎంవి కుమ్మక్కు రాజకీయాలు. మూడు పార్టీలకు జనం బుద్ధి చెబుతారు" అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.