Prashanth Neel: ఎవరైనా ముందుగా రాజమౌళి పేరు చెప్పాల్సిందే: ప్రశాంత్ నీల్

KGF 2 Movie Update

  • 'కేజీఎఫ్ 2'ను తెలుగు సినిమాగా భావిస్తున్నారు
  • మీ ఆదరణ మరిచిపోలేనిది    
  • నాలాంటివారికి రాజమౌళిగారు స్ఫూర్తి 
  • ఆయనకి థ్యాంక్స్ అని చెప్పిన ప్రశాంత్ నీల్

ప్రశాంత్ నీల్ .. 'కేజీఎఫ్' సినిమాతో ఈ పేరు ప్రపంచానికి పరిచయమైంది. ఇంత మాస్ యాక్షన్ మూవీని .. ఇంత   భారీ సినిమాను  హ్యాండిల్ చేసిన ఆయన చాలా సింపుల్ గా .. సాదా సీదాగా కనిపించడం చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి ఆయన నుంచి ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ నెల  14వ తేదీన 'కేజీఎఫ్ 2' విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా తెలుగు వెర్షన్  కి సంబంధించి హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రశాంత్ నీల్ మాట్లాడారు. "ఈ సినిమాను ఇక్కడి వాళ్లంతా ఒక తెలుగు సినిమాగానే భావిస్తున్నందుకు ఆనందంగా ఉంది. పాన్ ఇండియా దిశగా సౌత్ సినిమా వెళ్లేదారి ఒకప్పుడు చాలా చిన్నదిగా ఉండేది. అలాంటి దారిని రాజమౌళిగారు ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చారు. 

అందువలన ఈ రోజున పాన్ ఇండియా సినిమా చాలా తక్కువ సమయంలోనే కోట్లాదిమంది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. అందువలన నేను మాత్రమే కాదు .. పాన్ ఇండియా సినిమా తీసేవాళ్లంతా రాజమౌళి గారి పేరును ముందుగా చెప్పవలసిందే. నాలాంటి వారెందరికో ఆయన స్ఫూర్తి. సౌత్ సినిమా స్థాయిని పెంచిన ఆయనకి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించారు.

Prashanth Neel
Yash
KGF 2 Movie
Rajamouli
  • Loading...

More Telugu News