AIADMK: చిన్నమ్మకు షాక్... అన్నాడీఎంకేతో సంబంధం లేదన్న కోర్టు
- శశికళను సస్పెండ్ చేస్తూ అన్నాడీఎంకే తీర్మానం
- తీర్మానాన్ని సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన చిన్నమ్మ
- శశికళకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిన కోర్టు
- హైకోర్టును ఆశ్రయిస్తానన్న శశికళ
తమిళనాడు రాజకీయాల్లో సోమవారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మగా ఆ పార్టీ నేతలు భావించే శశికళకు తమిళనాడుకు చెందిన సెషన్స్ కోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకేతో శశికళకు ఏమాత్రం సంబంధం లేదంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు అన్నాడీఎంకే తీర్మానాన్ని సవాల్ చేస్తూ శశికళ దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను విచారించిన సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
శశికళను అన్నాడీఎంకే నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని కూడా సెషన్స్ కోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సెషన్స్ కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. అయితే సెషన్స్ కోర్టు కేవలం అన్నాడీఎంకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పైనే స్పందించిందన్న శశికళ.. తాను సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లుగా ప్రకటించారు.