Upendra: బన్నీ ఆ మాట అంటాడని ఊహించలేదు: ఉపేంద్ర

 Upendra said about Allu Arjun

  • బన్నీ అంటే తనకు చాలా అభిమానమన్న ఉపేంద్ర  
  • తనను ఆయన ఎంతో బాగా చూసుకున్నారని వ్యాఖ్య  
  • సెట్లో చాలా సరదాగా ఉంటారని కితాబు  
  • ఆయన అంకితభావం చూసి షాకయ్యానన్న ఉపేంద్ర

తెలుగులో ఒకప్పుడు హీరోగా తన ప్రత్యేకతను నిరూపించుకున్న ఉపేంద్ర, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. ' సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రను పోషించిన ఆయన, చాలా గ్యాప్ తరువాత 'గని' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో ఉంది.  
 
తాజా ఇంటర్వ్యూ లో ఉపేంద్ర మాట్లాడుతూ .. ''సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా చేసేటప్పుడు సెట్లో బన్నీ ఎంతో సరదాగా ఉండేవారు. నాకు ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసుకుని తెప్పించేవారు. ఆ సినిమా పూర్తయ్యేవరకూ నన్ను ఆయన ఒక గిఫ్టులా చూసుకున్నారు. ఆ రోజులను నేను ఇప్పటికీ మరిచిపోలేదు. 

 ఒకసారి నేను బన్నీని అడిగాను .. 'మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది ఏది?' అని. ఖరీదైన కార్లా? టూర్లకు వెళ్లడమా? అని అడిగాను. దానికాయన స్పందిస్తూ, 'నాకు అసలు దేనిపై పెద్దగా ఇష్టం ఉండదు. సినిమాలా నాకు మరేదీ సంతోషాన్ని కలిగించదు. షూటింగు ఉంటే నాకు ఆ రోజు పండగ రోజులా ఉంటుంది' అన్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారు ఆయనను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది" అని ఉపేంద్ర చెప్పుకొచ్చారు.

Upendra
Allu Arjun
S/O Sathyamurthy
  • Loading...

More Telugu News