తన మద్దతుదారులతో బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక భేటీ
- ప్రకాశం జిల్లాలోని బాలినేని నివాసంలో సమావేశం
- భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
- బాలినేనిని కలిసిన ఎమ్మెల్యేలు కొండారెడ్డి, నాగార్జున రెడ్డి
- ఒంగోలు జడ్పీటీసీ చండూచి కోమలేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
మంత్రి పదవి దక్కకపోవడంతో బాలినేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బాలినేనికి మద్దతుగా మేయర్, కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. అంతేగాక, ఒంగోలు జడ్పీటీసీ చండూచి కోమలేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.