KCR: ఢిల్లీలో కేసీఆర్ ధర్నా ప్రారంభం.. దీక్షకు హాజరైన టికాయత్!

KCR dharna started in Delhi

  • తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలనే డిమాండ్ తో ధర్నా
  • ఢిల్లీలో గులాబీమయమైన తెలంగాణ భవన్ పరిసరాలు
  • దీక్షా వేదికపైనే తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం

ఢిల్లీలోని తెలంగాణ భవన్ పరిసరాలు గులాబీమయం అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దీక్ష ప్రారంభమయింది. రైతులు పడించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలనే డిమాండ్ తో టీఆర్ఎస్ పార్టీ దేశ రాజధానిలో ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు రైతు సంఘం నేత టికాయత్ హాజరయ్యారు. వేదికపై కేసీఆర్ పక్కనే టికాయత్ ఆసీనులయ్యారు. 

ఇంకా టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు, పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొంటున్నారు. ధర్నాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ అల్టిమేటం ఇవ్వనుంది. దీక్షా వేదికపైనే టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నారు.

KCR
TRS
Delhi
Dharna
  • Loading...

More Telugu News