Pudding and Mink: మరో పబ్ యాజమాన్యం ఫిర్యాదుతోనే పుడింగ్ అండ్ మింక్ పబ్ పై ఇటీవల దాడులు... ఆసక్తికర అంశాల వెల్లడి

Interesting facts in  pub case

  • పబ్ లో లేట్ నైట్ పార్టీ జరుగుతోందని సమాచారం
  • డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు
  • పబ్ లో డ్రగ్స్ లభ్యం 
  • దాడులకు రెండు వారాల ముందే పబ్ కు డ్రగ్స్ చేరిక

ఇటీవల హైదరాబాద్ పోలీసులు బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న పుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడులు చేయడం తెలిసిందే. ఈ దాడుల్లో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. నగరంలోని మరో పబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ పబ్ పై దాడులకు దిగారు. పబ్ లో మాదకద్రవ్యాలు, హ్యాష్ ఆయిల్ సిగరెట్లు, గంజాయి విక్రయాల గుట్టురట్టు చేశారు. అంతేకాదు, ఈ దాడులకు రెండు వారాల ముందు పబ్ కు మాదకద్రవ్యాలు సరఫరా అయినట్టు తెలిసింది. 

ఈ కేసులో పబ్ ఓనర్ అర్జున్ వీరమాచనేని, కిరణ్ రాజుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అయితే, సోదరికి ప్రమాదం జరగడంతో తాను అమెరికాలో ఉన్నానని కిరణ్ రాజు పోలీసులకు ఈమెయిల్ ద్వారా వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. పబ్ లో తాను భాగస్వామిని మాత్రమేనని, అక్కడ డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్న విషయం తనకు తెలియదని కిరణ్ రాజు పోలీసులకు తెలిపాడు. 

కాగా, పుడింగ్ అండ్ మింక్ పబ్ లో పట్టుబడినవారిలో 20 మంది డ్రగ్స్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. వారికి నోటీసులు పంపేందుకు సన్నద్ధమవుతున్నారు. వీరిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Pudding and Mink
Pub
Drugs
Police
Hyderabad
  • Loading...

More Telugu News