heaven: అమ్మా.. తిరిగి స్వర్గంలో కలుసుకుందాం: రష్యా దాడిలో బలైపోయిన తల్లికి బాలిక రాసిన లేఖ

We will meet in heaven Ukrainian childs heartbreaking letter to mother killed in war

  • నాకు చక్కని జీవితాన్ని ఇచ్చావు
  • ఆకాశంలో ఉన్ననీవు స్వర్గానికి వెళ్లాలి
  • నేను మంచి అమ్మాయిగా జీవిస్తా
  • అప్పుడు స్వర్గానికి రావచ్చు
  • అక్కడే నిన్ను కలుసుకుంటా
  • డైరీలో రాసుకున్న ఓ బాలిక

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయిన ఓ మహిళను ఉద్దేశించి.. ‘స్వర్గంలో కలుసుకుందాం అమ్మా’ అంటూ ఉక్రెయిన్ బాలిక తన డైరీలో రాసుకున్న లేఖ ఎన్నో హృదయాలను కదిలిస్తోంది. కారులో వెళుతున్న సమయంలో రష్యా దళాలు చేసిన దాడికి బొరోద్యంక ప్రాంతంలో బాలిక తల్లి ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిని ఉద్దేశించి డైరీలో భావోద్వేగంతో 9 ఏళ్ల బాలిక రాసుకున్న లేఖను ఉక్రెయిన్ హోంశాఖ మంత్రి సలహాదారు యాంటోన్ జెరెన్ షెంకో ట్విట్టర్లో పంచుకున్నారు.

‘‘అమ్మా.. మార్చి 8న ఈ లేఖను నీకు అందిస్తున్నాను. నాకు తొమ్మిదేళ్లపాటు మంచి లైఫ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రపంచంలో నీవే గొప్ప అమ్మవు. నిన్ను నేను ఎప్పటికీ మరవను. ఆకాశంలో నీవు సంతోషంగా ఉండాలి. నీవు స్వర్గానికి చేరుకోవాలి. మనం స్వర్గంలోనే కలుసుకుందాం. స్వర్గానికి వెళ్లేందుకు వీలుగా మంచి నడవడికతో ఉంటాను’’ అని బాలిక తన డైరీలో రాసుకుంది.

More Telugu News