TPCC President: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ - టీఆర్ఎస్ ది బ్లేమ్ గేమ్: రేవంత్ వ్యాఖ్యలు

revanth reddy comments on Grain purchases
  • ధాన్యం కొనుగోళ్ల‌పై రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు
  • న‌ల్ల జెండా ఎగుర‌వేయ‌ని రైతుల‌కు రైతు బంధు ఇవ్వ‌మంటున్నార‌ని ఆరోప‌ణ‌
  • కేసీఆర్ త‌న నివాసంపై న‌ల్ల‌జెండా ఎందుకు ఎగ‌రేయ‌ట్లేద‌ని నిల‌దీత‌
తెలంగాణ యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్‌లు బ్లేమ్ గేమ్‌కు తెర తీశాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్ రెడ్డి ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు. 

ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి టీఆర్ఎస్ కొన‌సాగిస్తున్న ఆందోళ‌న‌ల‌ను ప్ర‌స్తావించిన రేవంత్ రెడ్డి..  రైతులు తమ ఇళ్లపై నల్లజెండా ఎగురవేయకపోతే రైతుబంధు ఇవ్వబోమని ఓ మంత్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను రైతునే అని జబ్బలు చరుచుకునే సీఎం కేసీఆర్ ఆయన నివాసం ఉండే ప్రగతి భవన్, ఫాంహౌస్ లపై నల్ల జెండా ఎందుకు ఎగరేయలేదని రేవంత్ రెడ్డి నిల‌దీశారు.
TPCC President
Revanth Reddy
Telangana
Congress

More Telugu News