Rat: వెలిగే దీపాన్ని లాక్కెళ్లి దుస్తుల్లో వేసిన ఎలుక... రూ.2 లక్షల నగదు దగ్ధం
![Rat caused fire accident in house](https://imgd.ap7am.com/thumbnail/cr-20220407tn624eceaed69c5.jpg)
- అహ్మాదాబాద్ లో ఘటన
- చైత్ర నవరాత్రుల సందర్భంగా దీపం వెలిగించిన వ్యాపారి
- ఎలుక చేసిన పనికి ఇల్లంతా మంటలు
- కాలిబూడిదైన నగదు
గుజరాత్ లోని ఓ వ్యాపారి ఇంట్లో విచారకర సంఘటన జరిగింది. అహ్మదాబాద్ కు చెందిన వినోద్ భాయ్ ఓ వ్యాపారి. చైత్ర నవరాత్రుల సందర్భంగా ఆయన తన ఇంట్లో దీపం వెలిగించారు. అయితే, ఓ ఎలుక ఆ దీపాన్ని లాక్కెళ్లి ఇంట్లో ఉన్న దుస్తుల్లో పడేసింది. దాంతో దుస్తులు అంటుకుని మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు కూడా కాలి బూడిదైంది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.