Asaduddin Owaisi: హైద‌రాబాద్‌ ప‌బ్ కేసులో య‌జ‌మాని మినహా మిగ‌తా ఎవ‌రినీ అరెస్ట్ చేయలేదు: అస‌దుద్దీన్

asaduddun slams police

  • కొకైన్ దొరికినప్పటికీ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం
  • ధనవంతుల పిల్లల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా విడుదల చేశారు
  • చట్టం అందరికీ సమానమే క‌దా? అని ఒవైసీ నిల‌దీత‌

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పోలీసుల సోదాల్లో డ్ర‌గ్స్ కూడా ల‌భ్య‌మైన విష‌యం తెలిసిందే. అయితే, ఇందులో దొరికిన‌ సినీ ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలందరినీ వదిలివేశారని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఆ కేసులో ప‌బ్ యజమాని మినహా ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం ఏంట‌ని నిల‌దీశారు. 

కొకైన్ దొరికినప్పటికీ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ధనవంతుల పిల్లల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా విడుదల చేశారని, చట్టం అందరికీ సమానమేనని చెప్పారు. పేదలు, ధనవంతులందరికీ చట్టాన్ని సమానంగా అమ‌లు చేయాల‌ని అన్నారు.  

Asaduddin Owaisi
MIM
Hyderabad
  • Loading...

More Telugu News