Vijayasai Reddy: మోదీపై ప్రశంసలు.. చిదంబరంపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy praises Modi

  • ఉగ్రవాదుల గుండెల్లో మోదీ రైళ్లు పరిగెత్తించారు
  • పాకిస్థాన్ గడ్డపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన ఘనత మోదీది
  • నాపైనా, జగన్ పైనా చిదంబరం, అజాద్ తప్పుడు కేసులు పెట్టించారన్న విజయసాయి 

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొనియాడారు. పాకిస్థాన్ గడ్డపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన ఘనత ఆయనదని అన్నారు. రాజ్యసభలో క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ నేతలు చిదంబరం, గులాం నబీ అజాద్... తనపైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. దేశంలో జరిగిన టెర్రరిస్టు దాడులన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని అన్నారు. సభను తప్పుదోవ పట్టించేలా చిదంబరం మాట్లాడుతున్నారని... చిదంబరం చెప్పేవి నీతులు, చేసేవి తప్పుడు పనులని విజయసాయి విమర్శించారు.

Vijayasai Reddy
Jagan
YSRCP
Narendra Modi
BJP
Chidambaram
Azad
  • Loading...

More Telugu News