Jagan: కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించిన జగన్.. ముగిసిన ఢిల్లీ పర్యటన
![jagan meets gadkari](https://imgd.ap7am.com/thumbnail/cr-20220406tn624d299ed074f.jpg)
- ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు
- జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి
- గడ్కరీతో రహదారుల నిర్మాణంపై చర్చ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జగన్ సమావేశమై రహదారుల నిర్మాణాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. గడ్కరీకి జగన్ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందించారు. నితిన్ గడ్కరీతో సమావేశం అనంతరం జగన్ ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. కాసేపట్లో ఆయన ఏపీ చేరుకోనున్నారు.