Thief: శ్రీకాకుళం జిల్లాలో ఆలయంలో చోరీకి వచ్చి ఇలా ఇరుక్కుపోయాడు... వీడియో ఇదిగో!

Thief stuck in a temple window

  • జాడుపూడిలో జామి ఎల్లమ్మ ఆలయం
  • లోపలికి చొరబడిన దొంగ
  • బయటికి వచ్చే క్రమంలో ఇరుక్కుపోయిన వైనం
  • పట్టుకున్న స్థానికులు

శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో చోరీకి వచ్చిన దొంగ కిటికీ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. ముందుకు రాలేక, వెనక్కిపోలేక దిక్కుతోచని స్థితిలో స్థానికులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం జాడుపూడిలో జామి ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది.

ఓ దొంగ ఆలయంలోకి చొరబడి చోరీ చేసిన సొత్తుతో బయటికి వచ్చేందుకు కిటికీ కన్నంలో దూరాడు. అయితే, నడుం భాగం పట్టక ఇరుక్కుపోయాడు. కాగా, ఆ దొంగను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి వచ్చిన ఆ వ్యక్తిని పాపారావు అనే యువకుడిగా గుర్తించారు.

Thief
Window
Temple
Stuck
Jadupudi
Srikakulam District

More Telugu News