Chiranjeevi: చిరంజీవిగారితో బన్నీని పోల్చడం కరెక్ట్ కాదు: అల్లు బాబీ

Allu Bobby  Interview

  • 'గని' సినిమా నిర్మాతగా అల్లు బాబీ
  • ఈ నెల 8వ తేదీన సినిమా విడుదల  
  • జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్
  • అందరికీ స్ఫూర్తి మెగాస్టార్ అని చెప్పిన బాబీ

బన్నీ కెరియర్ ను పరిశీలిస్తే తనని తాను మలచుకుంటూ .. మార్చుకుంటూ వచ్చిన తీరు కనిపిస్తుంది. ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించడానికి ఆయనపడే తపన ఎలాంటిదో తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది ఆయనను మెగాస్టార్ తో పోల్చడం జరుగుతోంది. ఈ విషయంపై బన్నీ అన్నయ్య అల్లు బాబీ స్పందించాడు. 

'గని' సినిమా ఈ నెల 8వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న అల్లు బాబీ, ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఈ ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను ఎప్పుడూ చిరంజీవిగారిని అల్లు అర్జున్ తో పోల్చి చూడలేదు .. అది కరెక్ట్ కాదు కూడా. 

చిరంజీవిగారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డారు. వాటిని అధిగమించి మెగాస్టార్ అయ్యారు. బన్నీ వెనుక మా తాతయ్య .. మా నాన్న ఉన్నారు. మా అందరికీ స్ఫూర్తి చిరంజీవిగారే. బన్నీ కూడా తనకి స్ఫూర్తి చిరంజీవిగారనే చెప్పాడు. మనలో స్ఫూర్తిని నింపిన వ్యక్తితో మనం ఎప్పుడూ పోల్చు కోకూడదు" అని ఆయన అన్నాడు.

Chiranjeevi
Allu Arjun
Allu Bobby
  • Loading...

More Telugu News