Andhra Pradesh: సీఎం జ‌గ‌న్‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ అభినంద‌న‌లు

ap Governor congratulated Chief Minister Jagan

  • కొత్త జిల్లాల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌
  • ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాల‌తో పాల‌న ప్రారంభం
  • ట్విట్ట‌ర్‌లో గ‌వ‌ర్నర్ కార్యాల‌యం పోస్ట్‌

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. సోమ‌వారం ఏపీలోమ 13 కొత్త జిల్లాల‌ను జ‌గ‌న్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం జ‌గ‌న్‌కు అభినంద‌న‌లు తెలిపింది.

ఏపీలో ఈ నెల 4 నుంచి 26 జిల్లాల‌తో పాల‌న ప్రారంభ‌మైంద‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించిన జ‌గ‌న్‌కు అభినంద‌నలు అంటూ గ‌వ‌ర్న‌ర్ స‌ద‌రు ట్వీట్‌లో పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఇంత‌కుముందే గ‌వ‌ర్న‌ర్‌కు పంపిన ఏపీ ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ ఆమోదంతోనే కొత్త జిల్లాల‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

Andhra Pradesh
YS Jagan
AP Governor
Biswabhusan Harichandan
  • Error fetching data: Network response was not ok

More Telugu News