Pakistan: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్.. ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన
- పాక్ సీజేగా పనిచేసిన గుల్జార్
- రెండు నెలల క్రితమే సీజే పదవి నుంచి రిటైర్
- పాక్ అధ్యక్షుడి ఆదేశం మేరకు ఇమ్రాన్ ప్రతిపాదన
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్ పేరును ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) కీలక నేత ఛౌధురీ ఫవద్ హుస్సేన్ కాసేపటి క్రితం ఓ కీలక ప్రకటన చేశారు.
గుల్జారీ అహ్మద్ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. కరాచీకి చెందిన గుల్జార్.. 2019లో పాక్ చీఫ్ జస్టిస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి..రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ దేశానికి ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరినో ఒకరిని ప్రతిపాదించాలంటూ ఇటు ఇమ్రాన్‌తో పాటు అటు విపక్ష నేతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ప్రతిపాదించారు.