Trivikram Srinivas: సినీ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ వెళ్తున్న‌ కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. బ్లాక్ ఫిల్మ్ తొల‌గింపు

police removes trivikram car black film
  • హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్ర‌త్యేక డ్రైవ్ 
  • కార్ల‌కు బ్లాక్ ఫిల్మ్ ఉంటే జ‌రిమానా 
  • జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తున్న త్రివిక్ర‌మ్ కారును త‌నిఖీ చేసిన పోలీసులు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ప్ర‌త్యేక డ్రైవ్ కొన‌సాగిస్తున్నారు. కార్ల‌కు బ్లాక్ ఫిల్మ్, వాహ‌నాల‌పై పోలీస్, ప్రెస్ స్టిక్క‌ర్లు ఉంటే వాటిని పోలీసులు తొల‌గించి జ‌రిమానా విధిస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా, సినీ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా త‌న కారుకు బ్లాక్ ఫిల్మ్ వాడి దొరికిపోయారు. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న కారును పోలీసులు ఆపారు. 

కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో దాన్ని తొలగించిన పోలీసులు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోన్న వారిని గుర్తించేందుకు పోలీసులు చేప‌ట్టిన ప్ర‌త్యేక‌ డ్రైవ్ లో ఇప్ప‌టికే సినీ హీరోలు, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మంచు మ‌నోజ్, కల్యాణ్ రామ్‌ కార్ల‌ను కూడా త‌నిఖీ చేసిన పోలీసులు బ్లాక్ ఫిల్మ్‌ ను తొలగించి చలానాలు విధించారు.
Trivikram Srinivas
Hyderabad
Tollywood

More Telugu News