Liam Livingstone: అతడు బ్యాటింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఊపిరి బిగపట్టుకోవాల్సిందే: మయాంక్ అగర్వాల్

I had no advice for Liam Livingstone said Agarwal

  • లివింగ్ స్టోన్ ప్రదర్శనపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ స్పందన
  • వైభవ్ అరోరా భిన్నమైన ఆటగాడు
  • జితేష్ శర్మ అద్భుతమైన కీపర్ అని ప్రకటన

సీఎస్కేపై చక్కని విజయంలో భాగమైన జట్టు సభ్యులు అందరికీ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అభినందనలు తెలియజేశాడు. గొప్ప ప్రదర్శన చేశారని పేర్కొన్నాడు. లివింగ్ స్టోన్ కు తాను ఇచ్చే సలహా ఏదీ లేదన్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఊపిరి బిగపట్టుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. రెండు వికెట్లు తీసిన వైభవ్ అరోరాను కూడా అగర్వాల్ మెచ్చుకున్నాడు.

‘‘కొన్ని సంవత్సరాల క్రితం వైభవ్ మాతోనే ఉన్నాడు. అప్పుడు అతడి ప్రతిభ ఏంటన్నది మేము స్వయంగా చూశాం. ఆ తర్వాత అతడ్ని కేకేఆర్ తీసుకుంది. అతడు భిన్నమైన ఆటగాడు కావడంతో ఎలాగైనా మళ్లీ తిరిగి తీసుకోవాలని అనుకున్నాం’’ అని అగర్వాల్ చెప్పాడు. 

ఇక జితేష్ శర్మలో ప్రతిభను గుర్తించడంలో కోచ్ అనిల్ కుంబ్లే పాత్ర ఉన్నట్టు తెలిపాడు. అతడు అద్భుతమైన కీపర్ అని ప్రకటించాడు. తనదైన శైలిలో ఆడినట్టు లియామ్ లివింగ్ స్టోన్ పేర్కొన్నాడు. బౌలింగ్ ను ఎంతో ఎంజాయ్ చేస్తానంటూనే.. నెట్స్ లో బ్యాట్ తోనూ ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News