Tollywood: డ్రగ్స్ కేసుతో నాకేం సంబంధం లేదు.. ప్రముఖులను వదిలేసి నాపై నిందలా?: సినీ నటి హేమ

Actor Hema Responded On Drugs Case

  • కావాలనే నన్ను బదనాం చేస్తున్నారు
  • దాడి చేసిన పబ్ కు తాను వెళ్లనేలేదని క్లారిటీ
  • బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు

డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటి హేమ స్పందించారు. కేసులో అనవసరంగా తన పేరును ప్రస్తావిస్తున్నారని ఆమె అభ్యంతరం చెప్పారు. ఏ సంబంధం లేని తనను ఎందుకు బదనాం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో ఉన్న పుడింగ్ అండ్ మింక్ పబ్ లో పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. 

రాహుల్ సిప్లిగంజ్, సినీ నటి నిహారిక సహా పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మళ్లీ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పబ్ కు తాను వెళ్లనేలేదని, కానీ, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తనపై అభాండాలు వేస్తూ పేరును ప్రసారం చేస్తున్నాయని హేమ ఆరోపించారు. ప్రముఖులను వదిలేసి తనపై నిందలు మోపడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇవాళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News