Uttar Pradesh: యూపీలో.. లొంగిపోవాలంటూ అత్యాచార నిందితుల ఇంటిని బుల్డోజర్ తో కూల్చిన పోలీసులు

Police Bulldozed Rape Accused House In UP

  • యూపీలోని సహరన్ పూర్ లో ఘటన
  • ఊరంతా డప్పులతో చాటింపు.. మైకుల్లో ప్రకటనలు
  • ఓ అమ్మాయిపై ఊరి పెద్ద కుమారుల అత్యాచారం
  • బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసుల కేసు 

యూపీలో పోలీసులు బుల్డోజర్ తో ఓ అత్యాచార నిందితుడి ఇంటి గోడ, మెట్లను కూల్చేశారు. లొంగిపోవాలని పేర్కొంటూ ఊరంతా చాటింపు వేశారు. మైకుల్లో ప్రకటన చేశారు. సహరన్ పూర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

అమ్మాయి తల్లి గత నెలలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ గ్రామ పెద్ద కుమారులైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, వారిద్దరూ పరారీలో ఉండడంతో 48 గంటల్లోగా లొంగిపోవాలని ఆదేశిస్తూ ఇంటిని పాక్షికంగా కూలగొట్టారు. లొంగిపోకపోతే పూర్తిగా కూలగొట్టేస్తామంటూ ఊరంతా చాటింపేసి ప్రకటించారు. 

గత ఏడాది డిసెంబర్ లో తన కూతురిని ఊరి పెద్ద కుమారుల్లో ఒకరు రేప్ చేశారని అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత తన బిడ్డ మైనారిటీ తీరి 18 ఏండ్లు నిండగానే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిందని, దీంతో ఊరి పెద్ద కుమారులు తాను ఇంట్లో లేనప్పుడు వచ్చి తన బిడ్డపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఆ వెంటనే ఊరిపెద్ద దగ్గరకు వెళితే అవహేళన చేసి చంపేస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. 

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులకు తాఖీదులు పంపినా పట్టించుకోలేదు. స్పందిస్తారని ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో నిందితుల ఇంటికి బుల్డోజర్ ను తీసుకెళ్లి ఇంటి మెట్లను, గోడను పాక్షికంగా కూల్చేశారు. వెంటనే లొంగిపోవాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News