Venkaiah Naidu: కులం కంటే గుణం మిన్న... ఉగాది సందేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
- తెలుగు ప్రజలకు వెంకయ్య గ్రీటింగ్స్
- ఉగాది సందర్భంగా కీలక సందేశమిచ్చిన వెంకయ్య
- అమ్మ భాషలోనే మాట్లాడాలన్న ఉపరాష్ట్రపతి
తెలుగు ప్రజలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు పలు అంశాలను ప్రస్తావిస్తూ సందేశం అందించారు. భారత సంస్కృతి వారసత్వం గొప్పదన్న వెంకయ్య..భారత్ ఎదుగుదల చూసి పాశ్చాత్య దేశాలకు అసూయ కలుగుతోందని వ్యాఖ్యానించారు. చట్ట సభల్లో సభ్యుల ప్రవర్తన హుందాగా ఉండాలని ఆయన సూచించారు.
సాంఘిక వివక్ష పాటించకూడదని అందరూ ప్రతిజ్ఞ చేయాలంటూ ఓ కీలక అంశాన్ని వెంకయ్య ప్రస్తావించారు. కులం కంటే గుణం మిన్న అన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. మన ఉనికిని కాపాడుకునేందుకు ఎల్లవేళలా ప్రయత్నించాలని వెంకయ్య పిలుపునిచ్చారు. మాతృ భాషలోనే మాట్లాడాలని నియమం పెట్టుకోవాలన్న వెంకయ్య.. అమ్మ భాష రాకుంటే అంతకుమించిన దారుణం మరొకటి లేదని కీలక వ్యాఖ్య చేశారు.