RRR: వారం రోజుల్లో రూ.710 కోట్ల వసూళ్లతో దుమ్మురేపుతున్న ఆర్ఆర్ఆర్

RRR First Week Collections

  • మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్
  • రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
  • విడుదలైన రోజు నుంచే ప్రభంజనం
  • ఒక్క భారత్ లోనే రూ.560 కోట్లు
  • బ్రేక్ ఈవెన్ కు మరో రూ.60.55 కోట్ల దూరంలో ఆర్ఆర్ఆర్

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే బాక్సాఫీసు రికార్డులపై గురిపెట్టిన ఆర్ఆర్ఆర్ వారం రోజులు గడిచేసరికి వందల కోట్లు కొల్లగొట్టింది. ఈ భారీ చిత్రం తొలివారం ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదే సమయంలో రూ.392.45 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ.60.55 కోట్లు వసూలైతే ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ కు వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

కాగా, ఆర్ఆర్ఆర్ మొదటివారం దేశవ్యాప్తంగా రూ.560 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి-2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను మాత్రం దాటలేకపోయింది. బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా తొలివారం రూ.860 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమాకు బెంచ్ మార్క్ సెట్ చేసింది.

RRR
Collections
First Week
World Wide
Gross
Share
India
Tollywood
Pan India
  • Loading...

More Telugu News