Ugadi: తెలంగాణ యువ‌త‌కు ఇది ఉద్యోగ నామ సంవ‌త్స‌రం: క‌ల్వ‌కుంట్ల క‌విత

kalvakuntla kavitha ugadi greetings to telangana people

  • ఉగాది గ్రీటింగ్స్ చెప్పిన క‌విత‌
  • ఉద్యోగాల భ‌ర్తీని ప్ర‌స్తావించిన ఎమ్మెల్సీ
  • ఉద్యోగ నామ సంవ‌త్స‌రంగా పిల‌వాల‌న్న క‌విత‌

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆమె ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన క‌విత‌.. ఉద్యోగార్థుల‌కు మాత్రం ఉద్యోగ నామ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ఏడాదిని ఉద్యోగ నామ సంవత్స‌రంగానే పిల‌వాలంటూ కూడా ఆమె పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ స‌ర్కారు తీసుకున్న చ‌ర్య‌ల ద్వారా తెలంగాణ‌కు పెద్ద సంఖ్య‌లో ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయ‌ని చెప్పిన క‌విత‌.. వాటి ద్వారా తెలంగాణ యువ‌త‌కు ల‌క్ష‌లాది ఉద్యోగాలు అందాయ‌న్నారు. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి కూడా శ్రీకారం చుట్టిన కేసీఆర్ స‌ర్కారు.. ఏకంగా దాదాపుగా 90 వేల ఉద్యోగాల భ‌ర్తీకి చ‌ర్య‌లు మొద‌లు పెట్టింద‌న్నారు. ఈ ప‌రీక్ష‌ల‌కు ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని టీ శాట్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News