VV Lakshminarayana: ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన
- 8 మంది ఐఏఎస్ లకు కోర్టు శిక్ష
- కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టు ఆగ్రహం
- ప్రతి అంశం ఫైళ్లలో రాస్తే బాగుంటుందన్న లక్ష్మీనారాయణ
- మౌఖిక ఆదేశాల పర్యవసానాలు కూడా గమనించాలని హితవు
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించడం తెలిసిందే. దీనిపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రతి అంశాన్ని అధికారులు ఫైళ్లలో రాస్తే కోర్టుకు వెళ్లే అవసరమే రాదని అభిప్రాయపడ్డారు. మౌఖిక ఆదేశాలు జారీ చేసేటప్పుడే అధికారులు వాటి పర్యవసానాలు ఏంటన్న దానిపైనా ఆలోచించుకోవాలని హితవు పలికారు.
పాఠశాల ఆవరణలో ఇతర భవనాలు ఉండొద్దని కోర్టు చెప్పిందని, అయినా భవన నిర్మాణాలు జరగడంతో కోర్టు ధిక్కరణగా పరిగణించిందని లక్ష్మీనారాయణ వివరించారు. ఉన్నతాధికారులు ఇలా శిక్షకు గురికావడం వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు. ఆయా సంఘాలు కూర్చుని ఇటువంటి అంశాలపై చర్చించుకోవాలని సూచించారు.
ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేది, చినవీరభద్రుడు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్, రాజశేఖర్, శ్యామలరావులకు 2 వారాల జైలు శిక్ష విధించిన హైకోర్టు.... అధికారులు క్షమాపణలు కోరడంతో జైలుశిక్షను రద్దు చేసి, సంక్షేమ హాస్టళ్లలో ఏడాదిపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ఆదేశాలు జారీ చేసింది.