Kondapaneni Mansi: హైదరాబాదులో గంజాయి విక్రయాలు సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అరెస్ట్

Hyderabad police arrests IT woman employee

  • కొండపనేని మాన్సీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రెండేళ్లుగా గంజాయి దందా
  • గత నెలలో పోలీసుల దాడులు
  • అప్పటి నుంచి పరారీలో మాన్సీ

కొండపనేని మాన్సీ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గంజాయి విక్రయాలు సాగిస్తూ హైదరాబాదు పోలీసులకు పట్టుబడింది. మాన్సీ తన భర్త మదన్ మనేకర్ తో కలిసి గంజాయి దందా నడిపిస్తున్నట్టు బోయిన్ పల్లి పోలీసులు గుర్తించారు. కొండపనేని మాన్సీ ఓ బహుళ జాతి ఐటీ సంస్థలో ఉద్యోగినిగా పనిచేస్తోంది. అయితే, ఐటీ రంగంలో పెద్ద ఎత్తున గంజాయికి డిమాండ్ ఉందని గుర్తించిన ఆమె అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తోంది. 

గత నెలలో పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోగా... మాన్సీ, మనేకర్ పారిపోయారు. తాజాగా మాన్సీని మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అరెస్ట్ చేశారు. మాన్సీ పూర్వీకులు తెలుగువారే. వారు చాలాకాలం కిందట మహారాష్ట్రలోని నాగపూర్ లో స్థిరపడ్డారు.

  • Loading...

More Telugu News