Lasith Malinga: తన రికార్డును దాటేసిన బ్రావోకు లసిత్ మలింగ అభినందనలు

Lasith Malinga congratulates CSK star for breaking his all time IPL record

  • ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా బ్రావో
  • 171 వికెట్ల రికార్డు చేరిక
  • మలింగ ఖాతాలో 170 వికెట్లు
  • ట్విట్టర్ లో మలింగ అభినందనలు
  • మరింత సాధించాలని ఆకాంక్ష

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ చరిత్రలో గొప్ప రికార్డు సాధించాడు. 171 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉంది. ఐపీఎల్ లో మలింగ 170 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్ లో బ్రావో మూడు వికెట్లు తీసి మలింగతో సమానంగా 170 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

తాజాగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్రావో మరో వికెట్ సాధించాడు. దీంతో అతడి ఖాతాలో 171 వికెట్ల రికార్డు వచ్చి చేరింది. ఫలితంగా మలింగను వెనక్కి నెట్టేసి మొదటి స్థానానికి వచ్చేశాడు. దీనిపై మలింగ ట్విట్టర్ లో స్పందించాడు. బ్రావోకు అభినందనలు తెలియజేశాడు.

‘‘బ్రావో ఒక ఛాంపియన్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా అవతరించినందుకు శుభాకాంక్షలు. నీవు భవిష్యత్తులో మరింత సాధించాలి’’ అంటూ లసిత్ మలింగ ట్వీట్ చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News