rice: బియ్యంలో పలు రకాలు... ఏ రకం బియ్యం ఆరోగ్యానికి మంచిది?
- పలు రంగుల్లో లభ్యమయ్యే బియ్యం
- వాటిల్లో పోషకాలు ఎక్కువ
- ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికం
- గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ తగ్గించే మంచి ఆయుధాలు
ప్రపంచంలో ఎక్కువ మంది జనాభాకు ఆహార అవసరాలు తీరుస్తున్నది బియ్యమే (రైస్). మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెల్ల బియ్యం వినియోగమే కనిపిస్తుంది. కానీ, రైస్ లోనూ చాలా రకాలు ఉన్నాయి. రంగు, రుచి, పోషకాలు ఇలా ఎన్నో వ్యత్యాసాలు ఈ రకాల మధ్య కనిపిస్తాయి. కొన్నింటిలో ఫైబర్ ఎక్కువ, పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి.
ఇది ముడి ధాన్యం. అంటే పాలిష్ పట్టనిది. తెల్ల బియ్యం మాదిరి కాకుండా బ్రౌన్ రైస్ పైన బ్రాన్ లేయర్ ఉంటుంది. గోధుమ రంగులో కనిపించేది అదే. ఇందులోనే పోషకాలు ఉంటాయి. బ్రౌన్ రైస్ పై పొర బ్రాన్ లో ఫ్లావనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు అయిన అపిజెనిన్, క్వెర్సెటిన్, ల్యుటెలిన్ ఉంటాయి. వ్యాధులపై పోరాడడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్ల పాత్ర ఎంతో కీలకం. ఇలా ప్లావనాయిడ్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కేన్సర్ తదితర తీవ్ర వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.
బ్లాక్ రైస్ లోనూ పలు రకాలున్నాయి. ఇండోనేషియన్ బ్లాక్ రైస్, థాయ్ జాస్మిన్ బ్లాక్ రైస్ అన్నవి మరీ నల్లగా ఉంటాయి. వండినప్పుడు పర్పుల్ రంగులో ఆహారం రెడీ అవుతుంది. దీన్నే ఫర్ బిడెన్ రైస్ అని కూడా అంటుంటారు. మరే ఇతర రకంలో లేనన్ని యాంటీ ఆక్సిడెంట్లు బ్లాక్ రైస్ లో లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు కలిగిన యాంథోసియానిన్స్ (ఫ్లావనాయిడ్ ప్లాంట్ పిగ్మెంట్లు) దండిగా ఉంటాయి. యాంథోసియానిన్స్ అన్నవి కేన్సర్ పై పోరాడే గుణాలను కలిగి ఉంటాయి. యాంథోసియానిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే కొన్ని రకాల కేన్సర్ రిస్క్ తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. బ్రెస్ట్ కేన్సర్ కణాలను అణచివేయడంలోనూ యాంథోసియానిన్స్ పనిచేస్తున్నట్టు తెలుసుకున్నారు.
హిమాలయన్ రెడ్ రైస్, థాయ్ రెడ్ కార్గో రైస్ లో పోషకాలు దండిగా ఉంటాయి. అధిక ప్రొటీన్, ఫైబర్ వీటిల్లో లభిస్తాయి. ఫ్లావనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. శరీర అవయవాల్లో ఉండే వాపు గుణాన్ని ఫ్లావనాయిడ్స్ తగ్గించేస్తాయి. హానికారకాలను బయటకు పంపించేస్తాయి. దాంతో గుండె జబ్బు, టైప్ 2 మధుమేహం రిస్క్ తగ్గుతుంది.
వైల్డ్ రైస్ లో అధిక ప్రొటీన్, వైట్ రైస్ తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఫైబర్ లభిస్తుంది. జంతువులపై చేసిన పరిశోధనల్లో వైల్డ్ రైస్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్టు తెలిసింది. వైట్ రైస్ కు బదులు వైల్డ్ రైస్ తీసుకుంటే, గుండెకు హాని చేసే ట్రై గ్లిజరైడ్స్, కొలెస్టరాల్ తగ్గిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇన్సులిన్ నిరోధకత, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను కూడా తగ్గిస్తుంది.