రాజమౌళి గారిపై నాకున్న నమ్మకం అది: శ్రియ
- 'ఆర్ ఆర్ ఆర్'లో మెరిసిన శ్రియ
- నా పాత్ర చాలా చిన్నదనే బాధలేదు
- పెద్ద ప్రాజెక్టులో చేశానని గర్వంగా ఉంది
- ఇంకా టిక్కెట్లు దొరకడం లేదన్న శ్రియ
అయితే శ్రియ పాత్ర నిడివి చాలా తక్కువ. ఆ విషయంలో ఆమె అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై శ్రియ స్పందించింది. " రాజమౌళిగారి సినిమా అనగానే నేను ఓకే చెప్పేశాను. కథ ఏమిటి? నా పాత్ర ఏమిటి? ఇంకా ఎవరెవరు చేస్తున్నారు? అనేది నేను అడగలేదు. అందుకు కారణం ఆయనపై నాకు గల నమ్మకమే.
ఈ సినిమాలో నా పాత్ర చాలా చిన్నదని నేను బాధపడటం లేదు. ఒక పెద్ద సినిమాలో భాగమైనందుకు సంతోషపడుతున్నాను. ఈ రోజున ఈ సినిమాను గురించి అంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా టిక్కెట్ల కోసం నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చింది.