Super Saver Card: 'సూపర్ సేవర్ కార్డు' తీసుకువచ్చిన హైదరాబాద్ మెట్రో... వివరాలు ఇవిగో!

Hyderabad metro brings Super Saver Card
  • మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్
  • పండుగ రోజుల్లో వర్తించే సూపర్ సేవర్ కార్డు
  • ధర రూ.59.. రోజంతా ప్రయాణం చేసే చాన్స్
కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో కార్యకలాపాలు ముమ్మరం చేసిన హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. తాజాగా సూపర్ సేవర్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు ధర రూ.59 మాత్రమే. దీంతో రోజంతా మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. అయితే, ఇక్కడో షరతు ఉంది. హైదరాబాదు మెట్రో రైల్ వ్యవస్థ ప్రకటించిన 100 సెలవు దినాల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఆయా సెలవు రోజుల్లో ఈ సూపర్ సేవర్ కార్డుతో హైదరాబాదు నగరంలో ఎక్కడ్నించి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. మెట్రో సెలవు దినాల జాబితాలో ప్రతి ఆదివారం, ప్రతి 2వ శనివారం, ప్రతి 4వ శనివారంతో పాటు శివరాత్రి, ఉగాది, బోనాలు, రంజాన్, మొహరం, వినాయకచవితి, ఆగస్టు 15, దసరా, దీపావళి, డిసెంబరు 26 (బాక్సింగ్ డే),  భోగి, సంక్రాంతి వంటి పర్వదినాల్లో ఈ సూపర్ సేవర్ కార్డు వర్తిస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు.
Super Saver Card
Hyderabad Metro
Commuters
Hyderabad

More Telugu News