Sensex: ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు

Markets ends in loses

  • మార్కెట్లపై రష్యా యుద్ధం ప్రభావం
  • 115 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 33 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

2021-22 ఆర్థిక సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్లు కోల్పోయి 58,568కి పడిపోయింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 17,464 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (1.95%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.66%), యాక్సిస్ బ్యాంక్ (1.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.93%), భారతి ఎయిర్ టెల్ (0.80%). 

టాప్ లూజర్స్:
రిలయన్స్ (-1.46%), విప్రో (-1.44%), డాక్టర్ రెడ్డీస్ (-1.04%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.59%), ఇన్ఫోసిస్ (-0.55%).

  • Loading...

More Telugu News