TTD: తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సినీ ప్ర‌ముఖులు

raghavendra rao visits ttd

  • తిరుమ‌ల‌కు కె.రాఘవేంద్రరావు, రాజేంద్ర ప్రసాద్
  • సినీ నిర్మాత బండ్ల గణేశ్ కూడా
  • తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అధికారులు

ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సినీ న‌టుడు రాజేంద్ర ప్రసాద్, సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్న అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణం వ‌ద్ద ఫొటోలు దిగారు. 

ద‌ర్శ‌నం అనంత‌రం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కుటుంబ స‌భ్యులు కూడా వేంక‌టేశ్వ‌రుడిని దర్శించుకున్నారు. 

            

TTD
Tirumala
Bangladesh
rajendra prasad
  • Error fetching data: Network response was not ok

More Telugu News