Ram Gopal Varma: రాజమౌళిగారూ.. మీకు తారక్, రామ్ చరణ్ ఉంటే.. నాకు అప్సర, నైనా ఉన్నారు: వర్మ

Ram Gopal Varma tweet to Rajamouli

  • అప్సర, నైనా గంగూలీలతో 'డేంజరస్' చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ
  • లెస్బియనిజం కథాంశంగా తెరకెక్కిన చిత్రం
  • సినిమా ప్రమోషన్ కు అన్ని అంశాలను వాడుకుంటున్న ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'మా ఇష్టం (డేంజరస్)' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అప్సర రాణి, నైనా గంగూలీలతో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లెస్బియనిజం కథాంశంతో ఈ చిత్రాన్ని వర్మ రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వర్మ బిజీగా ఉన్నారు. ప్రమోషన్ లో భాగంగా వర్మ ఏ అంశాన్నీ వదలడం లేదు. అన్ని అంశాలను తన సినిమా ప్రమోషన్ కు వాడుకుంటున్నారు. 

తాజాగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను వర్మ వాడుకున్నారు. 'వెల్ రాజమౌళి సార్. మీకు తారక్, రామ్ చరణ్ వంటి డేంజరస్ బోయ్స్ ఉంటే... నాకు నైనా గంగూలీ, అప్సర రాణి వంటి డేంజరస్ గర్ల్స్ ఉన్నారు' అని ట్వీట్ చేశారు. అంతేకాదు చరణ్, రాజమౌళి, తారక్ కలిసి ఉన్న ఫొటోతో పాటు... అప్సర, నైనాలతో తాను కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News