Andhra Pradesh: ఏపీలో 15 కరోనా కేసులు.. ఆరు జిల్లాల్లో కొత్త కేసులు లేవు
![ap corona cases updates](https://imgd.ap7am.com/thumbnail/cr-20220330tn62446367d8866.jpg)
- గత 24 గంటల్లో 8,349 కరోనా పరీక్షలు
- రాష్ట్రంలో 15 కొత్త కేసులు
- కరోనా మరణాలు నిల్
- తాజాగా కోలుకున్న 41 మంది
- ఇంకా 288 మందికి చికిత్స
ఏపీలో గత 24 గంటల్లో 8,349 కరోనా పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం జిల్లాలో 4 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 3 కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 41 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు.
ఏపీలో ఇప్పటివరకు 23,19,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,506 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 288 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220330fr624464bd62450.jpg)