YSRCP: కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై బొత్స స్పంద‌న ఇదే!

botsa comments on cabinet reshuffling

  • జ‌గ‌న్ చెప్పిన‌ట్టే ముందుకు సాగుతాం
  • పార్టీ బ‌లోపేతం కోసం క‌లిసిక‌ట్టుగా కృషి
  • ఎన్నో స‌మీక‌ర‌ణాల ఆధారంగా కూర్పు అన్న బొత్స‌

ఏపీ కేబినెట్‌లో కీల‌క మంత్రిగానే కాకుండా పార్టీలో సీనియ‌ర్ నేత కూడా అయిన బొత్స స‌త్య‌నారాయ‌ణ.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పందించారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం పూర్తిగా జ‌గ‌న్ ఇష్ట‌మ‌ని చెప్పిన బొత్స‌.. జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. దానికి అనుగుణంగానే సాగుతామ‌న్న భావ‌న వ‌చ్చేలా వ్యాఖ్యానించారు. 

ఈ సంద‌ర్భంగా బొత్స చెబుతూ.. "కేబినెట్‌పై నాయ‌కుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కూర్పు అంటే ఎన్నో స‌మీక‌ర‌ణాలు ఉంటాయి. పార్టీ బ‌లోపేతం కోసం క‌లిసికట్టుగా ప‌నిచేస్తాం. సీఎం జ‌గ‌న్ ఎలా చెబితే అలా ముందుకు సాగుతాం" అన్నారు.

YSRCP
Andhra Pradesh
AP Cabinet
Botsa Satyanarayana
  • Loading...

More Telugu News