Vaishnav tej: 'రంగ రంగ వైభవంగా' రిలీజ్ డేట్ ఖరారు!

Ranga Ranga Vaibhavanga release date confirmed

  • వైష్ణవ్ తేజ్ తాజా చిత్రంగా 'రంగ రంగ వైభవంగా'
  • లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ
  • కథానాయికగా కేతిక శర్మ 
  • జులై 1వ తేదీన విడుదల

వైష్ణవ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రంగ రంగ వైభవంగా' చిత్రం సిద్ధమవుతోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించాడు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. జూలై 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ యూత్ లో ఆసక్తిని పెంచాయి. 'ఉప్పెన' .. 'కొండ పొలం' తరువాత వైష్ణవ్ తేజ్ చేసిన సినిమా ఇది.

ఇక 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కేతిక శర్మకి కూడా ఇది మూడో సినిమానే. గ్లామర్ పరంగా కేతికకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి మరి.

Vaishnav tej
Kethika Sharma
Ranga Ranga Vaibhavanga Movie
  • Loading...

More Telugu News