COVID19: కరోనా కొత్త కేసుల కన్నా కోలుకుంటున్న వారే ఎక్కువ.. తాజా కేసులు, తాజా రికవరీలు ఎన్నంటే..!

Covid Recoveries More Than New Cases

  • 1,233 మందికి తాజాగా పాజిటివ్
  • నిన్న ఒక్కరోజే కోలుకున్న 1,876 మంది 
  • వేగంగా సాగుతున్న పిల్లలకు కరోనా టీకా కార్యక్రమం

దేశంలో కొత్తగా కరోనా బారిన పడుతున్న వారికన్నా.. దాని బారిన పడి కోలుకుంటున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా నిన్న 1,233 మందికి కరోనా పాజిటివ్ రాగా.. ఇంతకుముందు కరోనా బారిన పడినోళ్లలో 1,876 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,30,23,215కి పెరగ్గా.. కోలుకున్న వారి సంఖ్య 4,24,87,410కి చేరింది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. 

కరోనాతో మరో 31 మంది చనిపోగా.. మొత్తంగా ఇప్పటిదాకా 5,21,101 మంది మరణించారు. గతంలో మరణించిన 16 మంది వివరాలను కేరళ తాజాగా కలిపింది. నిన్న యాక్టివ్ కేసులు 674 తగ్గాయి. ప్రస్తుతం ఇంకా 14,704 మంది కరోనాతో ఇళ్లు లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు డైలీ పాజిటివిటీ రేటు 0.2 శాతానికి తగ్గగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.25 శాతంగా ఉంది. 

కరోనా వ్యాక్సినేషన్ మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా 183.82 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను వినియోగించారు. ఇటీవలే మొదలైన 12–14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ కొన్ని రోజుల్లోనే 1.5 కోట్ల మంది పిల్లలకు టీకాలిచ్చారు.

  • Loading...

More Telugu News